తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లోఆర్థిక ఇబ్బందులు తాళలేక చంద్రగిరి అపర్ణ (33) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రమాదేవి తెలిపారు. అపర్ణ భర్త కొన్నేళ్ల క్రితం మరణించగా ఇద్దరు పిల్లలతో సుజాతనగర్ లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. గత రాత్రి పిల్లలు నూడిల్స్ కోసం గొడవ పడడంతో మందలించగా మేనమామ ఇంటికి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన అపర్ణ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ