Sunday, 19 April 2026 01:58:42 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కిరణ్ కుమార్ ముదలక్కర్ బాధ్యతల స్వీకరణ

Date : 01 April 2026 04:46 PM Views : 357

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం లీగల్ ఇటీవల జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 30ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పాల్వంచ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది కిరణ్ కుమార్ ముదలక్కర్ బుధవారం జిల్లా కోర్టు లైబ్రరీ హాల్ నందు ఎన్నికల అధికారి పలివెల గణేష్ బాబు నుండి భాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరిని సమన్వయం చేసుకుంటూ,న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రణాళిక బద్దంగా పనిచేస్తానని,నూతన జిల్లా కోర్ట్ భవన నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.అనంతరం గెలుపొందిన బార్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.2026-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా,ప్యానెల్ లో గెలుపొందిన వివిధ హోదాల్లోని సభ్యులు తమ పదవులకు వన్నె తెచ్చేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు.కిరణ్ కుమార్ తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు కాటూరి సంజీవ్ రావు,శషాజన్ పర్వీన్,జిల్లా ప్రధాన కార్యదర్శి గడిపెల్లి మహేష్,సంయుక్త కార్యదర్శి గడదాస్ నాగరాజు,గ్రంథాలయ కార్యదర్శి దొడ్డ ప్రసాద్,కోశాధికారిగా గుళ్ళ సంధ్యరాణి క్రీడలు మరియు సంస్కృతిక విభాగం కార్యదర్శులుగా బానోత్ దేవదాస్,నకిరికంటి ఉమా,మహిళ ప్రతినిధిగా నిమ్మలురి ఉషారాణి లు నియామకపాత్రలు స్వీకరించారు.మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కిరణ్ కుమార్ ప్యానెల్ నుండి పోటీచేసిన 9 మంది గెలుపొందారు.ఈకార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జీ.వి.కే మనోహర్,బాబురావు,ఉటుకురి పురుషోత్తం,పలివేల సాంబశివరావు,ఆర్.విజయ్ కుమార్,లక్కినేని సత్యనారాయణ,రమేష్ కుమార్ మక్కడ్,గాజుల రామ్మూర్తి,అనుబ్రోలు రాంప్రసాద్,భాగం మాధవరావు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :