తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించనుండటంతో, జిల్లా అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ కారణంగా రేపు (22-09-2025) జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి రేపు జిల్లా కార్యాలయానికి ప్రజావాణి కోసం దరఖాస్తులు ఇవ్వడానికి రాకూడదని కలెక్టర్ సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ