తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 5వ తేదీ నుంచి జరుగుతున్న "స్వచ్చదనం - పచ్చదనం" కార్యక్రమమును పరిశీలించుటకు నియమించిన జిల్లా ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ గురువారం భద్రాద్రి కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా విద్యానగర్ గ్రామపంచాయతీలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ( వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత )ని పరిశీలించారు. ఆ యొక్క ఇంకుడు గుంతని ఏ విధంగా తయారు చేశారు , దానికి పట్టిన వరలెన్నీ, నీరు ఎలా ఇంకుతుంది అనే విషయాలని క్షుణ్ణంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రుద్రoపూర్ గ్రామపంచాయతీలోని హైస్కూల్ నందు ఏర్పాటు చేసినటువంటి మెడిసినల్ ప్లాంట్స్, టాల్ ప్లాంట్స్, స్కూల్ గార్డెన్,కమ్యూనిటీ ప్లాంటేషన్ మొక్కల విశిష్టతను జిల్లా కలెక్టర్ ను గౌతమ్ అడిగి తెలుసుకున్నారు. తర్వాత పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థులకు జిల్లా కలెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి గౌతమ్ విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి అభినందించారు.
అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పశు సంతతి నియంత్రణ కేంద్రం (యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ) సందర్శించి అక్కడ తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 27వ వార్డులోని ప్రగతి మైదానంలో మొక్కలు నాటారు. అనంతరం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గౌతం మాట్లాడుతూ స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమం అనంతరం కూడా గ్రామాలు పట్టణాలలో అదే ఉత్సాహంతో కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విద్యాచందన , జిల్లా పంచాయతీ అధికారి వి చంద్రమౌళి, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి రమణ రావు, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ మరియు ఎంపీడీవో చుంచుపల్లి విడివి అశోక్ కుమార్ , మండల పంచాయతీ అధికారి గుంటి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు సంజీవరెడ్డి, సత్యనారాయణ , నరేందర్ నాని, రమేష్ మొదలగువారు మరియు ఈజీఎస్ ఏపీవో రఘుపతి, ఏపిఎం రామకృష్ణ , ఈజీఎస్ ఈసి నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామపంచాయతీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ