తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 4 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల మిర్చి కల్లాలలో తడిసి ముద్దయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నే జూలూరుపాడు మండల రైతులు వాణిజ్య పంటలలో మిర్చి పండించే ప్రధమ స్థానం లో జూలూరుపాడు మండలం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇతర రాష్ట్రాల నుండి మిర్చి కోతలకు సుమారుగా20000 వేలమంది వస్తారు . కాగా ఈ సంవత్సరం చత్తీస్గఢ్ నుండి చాలా తక్కువ మంది కూలీలు రావడం వలన కూలీల కొరత ఎక్కువైంది. దానికి తోడు మార్కెట్లో రేటు లేక పోవడం ఇప్పుడు వాతావరణం సహకరించకపోవడం రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
Admin
తెలుగు వెలుగు టీవీ