Sunday, 19 April 2026 02:17:02 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

Date : 25 February 2026 07:55 PM Views : 196

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డయల్ 100 నకు ఫోన్ రాగానే త్వరితగతిన స్పందించి బాధితులకు అండగా నిలబడాలి.నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు బుధవారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రతీ కేసులో 'క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్' ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.గంజాయి వంటి మత్తు పదార్ధాలు,మట్కా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి తమ తమ నివాస ప్రాంతాల్లో మరియు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలని తెలిపారు.ప్రాపర్టీ కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి,భాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలని సూచించారు.తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన Arrive-Alive-2026 రెండో విడతలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ,ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి గురించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి మరియు జిల్లాలోని సిఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :