Friday, 19 June 2026 06:40:30 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

పోషణ అభియాన్ అద్భుత పథకం. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి.

Date : 16 February 2026 08:44 PM Views : 430

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగనవాడి అధికారులతో సమీక్ష సమావేశం. స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందుగల సమావేశ మందిరంలో మహిళా, శిశు, వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్క అంగనవాడి కేంద్రం తెరవాలని, తెరిచిన వెంటనే టీచర్, హెల్పర్, లబ్ధిదారుల హాజరు కేంద్ర రాష్ట్ర స్థాయి అప్లికేషన్లు అయినటువంటి పోషణ ట్రాకర్ మరియు న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టంలో నమోదు చేయాలని తెలిపారు. వైద్యశాఖ సమన్వయంతో అతి తీవ్ర పోషణ లోపం, పోషణ లోపం, తక్కువ బరువుతో ఉన్న పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షించి వైద్యుల సూచనల మేరకు న్యూట్రిషన్ రీహబిటేషన్ సెంటర్కి పంపించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతినెల క్రమం తప్పకుండా అత్యాధునిక సాంకేతిక పరికారాలతో పిల్లల ఎత్తు, బరువులు చూసి సరైన సమయంలో సరైన పోషణ అందించాలని కోరారు. కిశోర బాలికల కోసం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద "ఇందిరమ్మ అమృతం" పేరుతో 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల ఆడపిల్లలకు మిల్లెట్స్ తో కూడిన చిక్కిలు నెల నెల అందజేయడం జరుగుతుందని తద్వారా రక్తహీనత లోపం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడమే మన లక్ష్యం అన్నారు, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుత్తేదారులు పంపిణీ విషయంలో కానీ నాణ్యత విషయంలో గానీ అలసత్వం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ప్రతినెల షెడ్యూల్ ప్రకారం అంగనవాడి పర్యవేక్షకురాలు (సూపర్వైజర్) తమ సెక్టార్ యొక్క అంగన్వాడీ కేంద్రాల సందర్శించి రాష్ట్ర పోర్టల్ ఎం ఎం అంగనవాడిలో వివరాలను నింపాలని, పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహార విలువలపై టీచర్లకు అవగాహన కల్పిస్తూ, పోషణ అభియాన్ పథకంలో భాగంగా తల్లుల కమిటీ, గ్రామస్తులు, గ్రామ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో సామూహిక వేడుకలు అయినటువంటి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతాలు నిర్వహిస్తూ వారిలో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తనదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వతంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు గాను పెరటి తోట పెంపకాలు (న్యూట్రి గార్డెన్స్) నిర్మించారని దీనిని ఆదర్శంగా తీసుకొని వివిధ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత లెనీనా, జిల్లా సిడిపివోలు ప్రసన్న లక్ష్మి, జయలక్ష్మి, తార, అరుణ కుమారి, పద్మశ్రీ, చైతన్య, సలోమి, హేమ సత్య, జ్యోతి, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ పొనుగోటి సంపత్, జిల్లా కార్యాలయ సిబ్బంది హసీనా, భార్గవి, డి. సి .పి .ఓ హరికుమారి, చైల్డ్ లైన్ సందీప్, జిల్లా పోషణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :