తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను జిల్లాల వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి స్వీకరణ, అర్హులైన ఓటర్ల వివరాల నమోదు తదితర ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి బూత్ లెవెల్ అధికారికి కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు.జిల్లాల వారీగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుకు చేపట్టిన చర్యలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశాలు, ఫీల్డ్ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రతి అర్హ ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు . కార్యక్రమం అమలుపై క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీందర్ నాథ్, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎలక్షన్ సిబ్బంది నవీన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ