తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ గేయం ‘వందేమాతరానికి’ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా"వందే మాతరం" జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు మరియు జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లలో వందేమాతర గేయాన్ని అధికారులు మరియు సిబ్బంది ఆలపించారు.భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని,ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకలలో భాగంగా సామూహికంగా ఆలపించడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ