తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి.వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.మాదక ద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాలి. జల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను బుధవారం నాడు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో వర్టికల్స్ గా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా పనితీరు గురించి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులను, ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. గంజాయి హాట్ స్పాట్ లను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలి అని తెలిపారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు అక్రమ రవాణా చేసిన, వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.డయల్ 100 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తా అని తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీతో పాటు అధికారులు మరియు సిబ్బంది మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ ఆర్. సతీష్ కుమార్,సీఐ సతీష్, ఎస్సై మధు ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ