Friday, 19 June 2026 04:17:43 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి.

Date : 04 June 2026 07:37 PM Views : 70

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం.ఐక్యతతోనే మహిళా లోకం తమ హక్కులను సాధించుకోవాలి.మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను అరికట్టాలి. మహిళా హక్కుల రక్షణకు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోంది.మహిళల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలి.భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను అరికట్టడంతో పాటు వారి హక్కుల రక్షణకై చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె సమాఖ్య జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ.. మహిళా సమాఖ్య సుదీర్ఘ కాలంగా మహిళల అభ్యున్నతి కోసం చేసిన సేవలను, నిర్వర్తించిన బాధ్యతలను గుర్తుచేశారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని, మహిళా చట్టాల అమలులో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దొంగాట ఆడిందని, మహిళలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటోందని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, హక్కుల సాధన కోసం మహిళా లోకమంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మజ, ధనలక్ష్మి, రత్నకుమారి, గోనె మని, లక్ష్మి, మంద నిర్మల,శాంతి, మేదిని లక్ష్మి, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :