Monday, 20 April 2026 01:34:51 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే సాధ్యం. బడిబాట కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 03 June 2025 08:00 PM Views : 723

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలలో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలను పొందేలా బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ.డి. ఓ.సి, కార్యాలయం లో లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 6 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, డిజిటల్ విద్య , ఉపకార వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల గురించి అందరికీ తెలియజేసి, వారందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 6 నుండి 14 సం. వయసు కలిగిన బడిఈడు పిల్లలందరిని గుర్తించి, సమీపంలోని బడికి వెళ్లేలాగా ప్రోత్సహించాలన్నారు.మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులతో, మహిళా సమాఖ్యల ద్వారా, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, అర్హత కలిగిన తరగతుల్లో తిరిగి చేర్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో లభించే నాణ్యమైన విద్య గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బడిబాట కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. బడిబాట కార్యక్రమంలో అధికారులు ప్రభుత్వ పాఠశాలలకు ఎవరైతే పిల్లలను పంపించడానికి ఇష్టపడటం లేదో దానికి గల కారణాలను నమోదు చేయాలన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయులు గ్రామాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు అందించే నాణ్యమైన విద్య గురించి వారికి అవగాహన కల్పించి తల్లిదండ్రుల యొక్క డబ్బు వృధా కాకుండా చూడాలన్నారు. జిల్లావ్యాప్తంగా రానున్న రెండు వారాల్లో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించి వాటికి తగిన మరమ్మతులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ విద్యా సంవత్సరం పూర్తయ్య నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు మట్టి ఇటుకలతో ప్రహరీ గోడల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో ఏకరూప దుస్తుల తయారీ పూర్తి చేసి అన్ని పాఠశాలలకు అందించాలని అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు మరియు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉల్లాసం యాప్ ద్వారా 15 సంవత్సరాల కంటే పైబడిన వయస్సు వారిలో నిరక్షరాశులను గుర్తించి వారికి అభ్యాసం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 100% అక్షరాస్యత సాధించే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణ పై అవగాహనలో భాగంగా, పాఠశాలల్లోని ఎకో క్లబ్స్ ఆధ్వర్యంలో, సీడ్ బ్యాంకు ద్వారా విత్తనాలు ఎక్కువగా సేకరించిన పాఠశాలలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో 100% ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో తులసి,చింత, ఉసిరి, వెలగ, మునగ మరియు కరివేపాకు చెట్లు విస్తృతంగా నాటాలన్నారు. జిల్లావ్యాప్తంగా అజోల్ల, బయోచార్, కంపోస్ట్ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతల నిర్మాణం, ఫామ్ పౌండ్స్ నిర్మాణం వంటి అంశాలపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమన్వయ సమావేశంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు పి. పి.టి లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, మెప్మా పీడీ రాజేష్,జిల్లా విద్యాధికారి ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఇందిర, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, ఏపీఎంలు మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :