తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ప్రజలు నిత్యం వినియోగించే నిత్యా అవసర వస్తువులను మొదలుకొని అనేక మైన వస్తువుల పైన GST ని గణనీయంగా తగ్గించిన పేదల పక్షపాతి నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ వద్ద వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడి గుండెను తట్టే విధంగా నిత్యవసర వస్తువుల తో పాటు అనేక విధమైన వస్తువులపై ముఖ్యంగా వ్యవసాయ,మెడికల్ మరియు ఇతర నిత్యావసర వస్తువులపై భారీ ఎత్తున GST నీ తగ్గించి భారతదేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇచ్చిన మహానుభావుడు అని ఈ సందర్భంగా కొనియాడారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద వ్యక్తికి మూడు నెలలు ఒకేసారి రేషన్ అందించడమే కాకుండా సన్నబియ్యాన్ని పేదలకు ఇచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యుడు పైడిపాటి రవీందర్, జిల్లా నాయకులు శివ, రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులు రవి నాయక్, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సలీం, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్,పట్టణ ప్రధాన కార్యదర్శి గుంపుల మహేష్, కృష్ణారెడ్డి, లక్ష్మీదేవి పల్లి మండల జిల్లా కౌన్సిల్ సభ్యుడు జల్లారపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు నోముల రమేష్, యమ్మూరి, శివ,యాదగిరి, బుర్ర సతీష్. మహంకాళి శంకర్, రాధాకృష్ణ కనకం నవీన్, జనగణప నరేష్, మహిళా నాయకురాలు గూడ విజయ, పట్టణ ఉపాధ్యక్షుడు రాంబాబు నాయక్ మరియు పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ