తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 5 తెలుగు వెలుగు) పర్యావరణం దినోత్సవ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూలూరుపాడు రేంజ్ తరఫున వినోబా నగర్ నర్సరీ ప్రాంగణంలో జరపడం జరిగింది. వినోబా నగర్ నర్సరీ ఏరియాలో వినోబా నగర్ వి ఎస్ ఎస్ సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో సుమారు వంద మొక్కలు నాటారు. మరియు నర్సరీ పరిసర ప్రాంతం, నర్సరీ ప్రక్కన గల సీతల్ల భవాని దేవాలయ పరిసరాలలో గల వ్యర్ధాలను ( ప్లాస్టిక్) అటవీ శాఖ సిబ్బంది శుభ్రపరచడం జరిగింది. FRO ప్రసాద్ రావు ఈ సందర్భంగా ప్రజలు పర్యావరణం కాపాడుకోవలసిన ప్రాముఖ్యతను గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో dro ఎస్.కె నా సూర్ బి, fbo లు శరన్, శ్రీలత, రేఖా,వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ బానోతు రూప్ల, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ