తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో మార్వాడి హటావో - తెలంగాణ బచావో అనే నినాదంతో మార్వాడి గో -బ్యాక్ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ బచావో మూమెంట్ (TBM )వ్యవస్థాపకులు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయుకులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. పిడమర్తి రవి నాయకత్వంలో 08.09.2025 సోమవారం నాడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయాలనీ మాదిగ జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ బచావో మూమెంట్ రాష్ట్ర నాయుకులు గద్దల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్బంగా శనివారం నాడు మండల కేంద్రంలో మాట్లాడుతూ.... మార్వాడి గో -బ్యాక్, తెలంగాణ బచావో మూమెంట్ నిర్మాణం, ప్రజా సంఘాల పాత్ర అనే అంశాలతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది అని అన్నారు... కావునా ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు, ప్రజా సంఘాల నాయుకులు పెద్ద ఎత్తున తరలి రావాలి అని కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ