తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలోని కరి వారి గూడెం గ్రామపంచాయతీలో బాడవపోడు గ్రామానికి ఇదివరకే బోరు ఉండి మోటర్ లేక త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి నేనున్నానంటూ కరివారిగూడెం గ్రామ నివాసి ఊటుకూరు నాగేశ్వరరావు కొత్త మోటర్ ని ఫిట్టింగ్ చేయించి ప్రజలకు నీరు అందించారు. బాడవ పోడు గ్రామస్తులు పాయం నరసింహారావు, బట్టు భాస్కర్ మాట్లాడుతూ మా గ్రామ మంచినీటి అవసరాన్ని తీర్చినందుకు మీకు రుణపడి ఉంటామని అన్నారు. అదేవిధంగా కరి వారి గూడెం కాలనీ రామాలయం గుడి దగ్గర నీటి అవసరం ఉందని తెలుసుకొని కొత్తగా బోరు వేయించారు. కాలనీవాసి గుగులో కోటేశ్వరరావు ఊటుకూరు నాగేశ్వరరావు సాయాన్ని మరువలేమన్నారు. కరి వారి గూడెం గ్రామస్తులు వడ్డే వెంకటనారాయణ, వేముల వెంకట్, వడ్డే వీర మోహన్ మరియు గ్రామస్తులు నాగేశ్వరరావు సేవలు అద్భుతం అని కొనియాడారు
Admin
తెలుగు వెలుగు టీవీ