తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 20 ( తెలుగు వెలుగు). జూలూరుపాడు మండలం లో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశాల మేరకు రైతుల రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ పై ప్రజావాణి కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్ కాకర్ల రైతు వేదిక లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. రెండు లక్షల రూపాయలు రుణం కంటే తక్కువగా ఉన్న రైతులు రేపు నరసాపురం రైతు వేదికలో అప్లికేషన్లు ఇవ్వవలసిందిగా కోరారు ఈ కార్యక్రమం లో కాకర్ల ఏ ఈ ఓ లావణ్య. జూలూరుపాడు ఏఈఓ గౌస్. నరసాపురం ఏఈఓ గోపికృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ