Monday, 20 April 2026 01:41:52 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

జిల్లాలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు మరియు కాలనీలు,కమ్యూనిటీ లలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంకులు,ATM ల వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేస

Date : 26 July 2025 03:27 PM Views : 371

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన నేరాలను అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.జిల్లా పరిధిలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు,కాలనీలు మరియు ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.ముఖ్యంగా బ్యాంకులు,ATM ల వద్ద సీసి కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.కాలనీలు,కమ్యూనిటీలలోకి ప్రవేశించే డెలివరీ బాయ్స్ యొక్క వివరాలను నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వారిని అనుమతించాలని తెలిపారు.ఇంటి యజమానులు తమ ఇండ్లలో అద్దెకు నివసించే వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించుకొని తమ వద్ద పెట్టుకోవాలని తెలిపారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇండ్లలో విలువైన వస్తువులను ఉంచకూడదని,అదే విధంగా ఇరుగు పొరుగు వారికి,స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.తమ తమ నివాస ప్రదేశాల్లో అర్ధరాత్రి వేళల్లో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని కోరారు.తెల్లవారుజామున ఇండ్ల ముందు వాకిలి శుభ్రం చేసేటప్పుడు,రోడ్లపై వాకింగ్ చేసే సమయాల్లో బంగారు ఆభరణాలను ధరించరాదని సూచించారు.ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని,సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.దొంగతనాల నివారణకు,రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పోలీసు వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.జిల్లాలోని ప్రధాన రహదారులు,ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.పరిశ్రమల యాజమాన్యాలు,వ్యాపారస్తులు మరియు అన్ని వర్గాల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు.ఇప్పటికే జిల్లాలో నమోదైన చాలా కేసులలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందని అన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలు మరియు కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.నేరాలను ఛేదించడంతోపాటు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని అన్నారు.కావున జిల్లా ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ తాము నివసించే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :