తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలం తొమ్మిదో మైల్ తండా సమీపంలో ఆదివారం 15 మంది కూలీలు కలుపు మందు కలిపిన నీళ్లు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మిరపనారు నాటడానికి వెళ్లిన వీరికి, కలుపు మందు బిందెను శుభ్రం చేయకుండానే అందులో మంచి నీళ్లు పోసి ఇవ్వడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే సహ కూలీలు స్పందించి, బాధితులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ