Monday, 20 April 2026 01:58:05 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

యోగాని జీవితంలో భాగం చేసుకోవాలి *ప్రకృతి ఆశ్రమంలో యోగా డే

Date : 21 June 2025 05:01 PM Views : 792

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని, తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను అదుపు చేసుకోవచ్చని పలువురు వక్తలు అన్నారు.శనివారం ప్రకృతి ఆశ్రమంలో అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని ఘనంగాజరుపుకున్నారు..ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..మనం శారీరకంగా బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుందన్నారు. 2025 సంవత్సరానికి గాను, యోగా నినాదాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే భూమిని కాపాడుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.యోగా వలన శరీర సమతుల్యత ఏర్పడుతుందనీ, స్వయం ప్రతిబంధక వ్యాధులు కంట్రోల్ లో ఉంటాయనీ,శ్వాసక్రియ కూడా నిలకడగా ఉంటుందన్నారు.శరీరంలో ఉన్న అవయవాల అన్నిటికీ రక్తప్రసరణ మెరుగవుతుందనీ, వెన్నెముక దృఢత్వం పెరుగుతుందనీ,నిత్యం పనుల ఒత్తిడితో సతమతమయ్యే వారి మనసుకి సాంత్వన చేకూరుతుందనీ వెల్లడించారు.సంపూర్ణ ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, సమాజ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే యోగాని సొంతం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి అతిథులుగా పాల్గొని మాట్లాడినవారిలో.. సింగరేణి ఏజీఎం గోనె శ్రీకాంత్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సంఘం వెంకట పుల్లయ్య, పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య, సింగరేణి రిటైర్డ్ జిఎం శనగ వెంకటేశ్వర్లు, ప్రముఖ వైద్యులు కనకరాజు, టేకులపల్లి సిడిపిఓ తార, రిటైర్డ్ సిడిపిఓ కనకదుర్గ లు మాట్లాడగా, రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ తిరుపాలు, ఆశ్రమం కో_ఆర్డినేటర్, యోగ ఇన్స్ట్రక్టర్ సుగుణ రావు, ఆశ్రమం సభ్యులు కే హెచ్ ప్రసాద్, కుమార్, జంపన్న, రాజేష్, విష్ణు కుమార్ పంచార్య, రాజమణి, శివ, శోభారాణి, స్వరూప, ఉమా , పిచ్చయ్య పాల్గొన్నారు. యోగ ఆసనాలను ప్రోటోకాల్ ప్రకారం సీనియర్ యోగ మాస్టర్ రాజేంద్రప్రసాద్, సుగుణారావులు చేయించగా, మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో మొక్కను నాటారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :