తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు ఉద్యమానికి భారీ విఘాతం కలిగింది. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన 108 మంది మావోయిస్టులు రాష్ట్ర DGP అరుణ్ దేవ్ గౌతమ్ ఎదుట లొంగిపోయారు. వీరిచ్చిన సమాచారంతో పోలీసులు జరిపిన గాలింపులో భారీ డంపు బయటపడింది. ఇందులో ₹3.65 కోట్ల నగదు, ₹1.64 కోట్ల విలువైన బంగారంతో పాటు AK-47, LMG వంటి 101 అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు చరిత్రలో ఇది అతిపెద్ద లొంగుబాటు.
Admin
తెలుగు వెలుగు టీవీ