తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వందేమాతరం 150వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత జాతీయ గీతం “వందేమాతరం” రచయిత శ్రీ బంకిం చంద్ర చటర్జీ ఈ కీర్తి గీతాన్ని రచించిన సందర్భం గా భారత ప్రభుత్వం ఆ ఘట్టాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సామూహికంగా వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కంప్లెక్స్ (IDOC) సమావేశ మందిరంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదన కలెక్టర్ శ్రీమతి విద్యా చందన వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించారు. ఈ సందర్భంగా అధికారులంతా దేశభక్తి, ఐక్యత, స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్ర్య సమరంలో పోషించిన విశిష్ట పాత్రను స్మరించుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ