తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధి లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా సందర్శిచారు. పదవ తరగతి పిల్లలతో ఇంగ్లీషులో మాట్లాడిన కలెక్టర్ పిల్లలు చాలా యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు. తర్వాత వంటగది మరియు స్టోరేజ్ రూమును పరిశీలించారు. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భోజనం బాగుందని వంటగది మరియు స్టోరేజ్ గదులు శుభ్రముగా ఉన్నాయని వంటగదిలో కొన్ని రిపేర్ అవసరం ఉన్నాయని పాఠశాల వారు తెలిపారు వాటిని త్వరలోనే రిపేర్ చేపిస్తామని తెలిపారు. పిల్లలకు ప్లేగ్రౌండ్ మంచిగా ఉందని కాకపోతే ఆటలకు సంబంధించి నా ఆట వస్తువులు మరియు పరికరాలు లేవని తెలిసింది వాటిని ఏర్పాటు చేస్తాం. ఈ పాఠశాలను గ్రామపంచాయతీ మరియు రెవెన్యూ మంచిగా పరిశీలన చేస్తున్నారని తెలిపారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించినందుకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు మీ పిల్లలకు డిగ్రీ పూర్తయిన తర్వాతనే పెళ్లి ఆలోచన చేయాలని అమ్మాయిల చదువు కుటుంబాలకు మంచిదని అన్నారు. ఈ సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో అజయ్, ఎంపీ ఓ తులసిరామ్,సూపరింటెండెంట్ రవి, పాఠశాల ఎస్ఓ పద్మజ ఉన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ