తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 8 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన యూనిఫాం క్లాత్ లు ఈరోజు మండల విద్యా వనరుల కేంద్రం నికి చేరుకున్నాయి. ప్రభుత్వం విద్యా సంవత్సరం విద్యా సంవత్సరం పున ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫామ్ అందించాలన్న సదుద్దేశంతో ముందుగానే యూనిఫామ్ లను మండల విద్యా వనరుల కేంద్రానికి పంపించడం జరిగిందని ఎంఈఓ జుంకీలాల్ పేర్కొన్నారు. ఈ యూనిఫామ్ క్లాత్ ను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేసి అనంతరం వారి వద్ద నుండి పాఠశాల పరిధిలోని SHG గ్రూపు సభ్యుల ద్వారా కుట్టించి విద్యార్థులకు అందించడం జరుగుతుందని ఎంఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరస్వామి, లక్ష్మణ్ ఐఇఆర్పి శ్రీను, ఎం ఐ ఎస్, సి సి ఓ, సి ఆర్ పి లు పాల్గొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ