Friday, 19 June 2026 02:53:01 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ.

Date : 12 June 2026 06:52 PM Views : 98

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలపై వినియోగదారులు ప్రవక్తగా ఉండాలని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ అన్నారు. పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సైబర్ మోసాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎస్బిఐ గత రెండు సంవత్సరాలుగా ఖాతాదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎస్బిఐ ఆధ్వర్యంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్లయితే మొదటి గంటలోనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా, సైబర్ మోసాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. సైబర్ భద్రతపై సమాచార బ్యానర్లను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. పాల్గొన్నవారికి వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలు, నివారణ చర్యలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, ఏటీఎం కార్డు వివరాలు, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు సలహా ఇచ్చారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. వినియోగదారులలో సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ అలవాట్లను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో కొత్తగూడెం ఐదు బ్రాంచ్ లకు చెందిన బ్రాంచ్ మేనేజర్లు, సారపాక బ్రాంచ్, టౌన్ సారపాక బ్రాంచ్, భద్రాచలం బ్రాంచ్, యూబీ రోడ్ బ్రాంచ్, ఐటీడీఏ పిఓ బ్రాంచ్, పాల్వంచ బ్రాంచ్, కిన్నెరసాని బ్రాంచ్, సిల్ బ్రాంచ్‌, స్థానిక శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: