Friday, 19 June 2026 04:31:43 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దివ్యాంగుల జిల్లా స్థాయి కమిటీ సమావేశం మరియు వయోవృద్ధుల జిల్లా స్థాయి కమిటీ సమావేశo

Date : 23 May 2025 07:05 PM Views : 509

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దివ్యాంగుల జిల్లా స్థాయి కమిటీ సమావేశం మరియు వయోవృద్ధుల జిల్లా స్థాయి కమిటీ సమావేశo ఐ.డి.ఓ.సి సమావేశ మందిరం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ దివ్యాంగులైన చిన్నపిల్లలకు విద్య ముఖ్యమని, డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్, స్పెషల్ ఎడ్యుకేషన్, ఐ.ఈ.డి. స్కూల్స్ నందు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జిల్లా విద్యాశాఖ, ఐసిడిఎస్ అధికారులు శ్రద్ధ వహించి దివ్యాంగ పిల్లలను గుర్తించి పాఠశాలకు పంపే విధంగా తమ చర్యలు తీసుకోగలరని తెలిపారు. ఆర్.బి.కే.ఎస్. వాహనం ద్వారా చెక్ అప్స్, హోం విజిట్స్, ఎడ్యుకేషన్, భవిత స్కూల్స్ ద్వారా అలవెన్సులు, స్కాలర్షిప్లు మంజూరు చేస్తారని, వాటిని కచ్చితంగా అమలు చేసేటట్లు చూస్తామని, అన్ని సంక్షేమ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, బ్యాక్లాగ్ వేకెన్సీస్ నింపుటకు చర్యలు తీసుకుంటామని, యూ.డి.ఐ.డి. కార్డులు మంజూరు చేయుటకు , సదరు సమస్యలను పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులకు పనులు కల్పిస్తామని, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలు నందు ర్యాంపులు లేని చోట ర్యాంపులు ఉండేలా చర్యలు తీసుకుంటామనీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా అంత్యోదయ కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, బ్యాటరీ ఆపరేటర్ సైకిల్స్ రిపేర్ చేయుటకు టెక్నీషియన్లను నియమిస్తామని, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన వంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. జిల్లా వయోవృద్ధుల కొరకు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మరియు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని, జిల్లాలోని అన్ని మండలాలలో ఆయుర్వేదిక్ క్యాంపులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని, వయోవృద్ధులకు సహాయ సహాయ ఉపకరణములు కొరకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల పోషణ లు మరియు సంక్షేమ చట్టం ద్వారా వయో వృద్ధులకు రక్షణ కల్పిస్తామని, మెయింటినెన్స్ ట్రిబ్యునల్ ద్వారా కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోహిత్ రాజ్ జిల్లా ఎస్పీ, , వేణుగోపాల్ అడిషనల్ కలెక్టర్, డి.అనసూర్య ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎస్.జయలక్ష్మి అడిషనల్ డిఎంహెచ్ఓ, సిహెచ్ రాజేష్ మెప్మా పీడి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కే.శ్రీ రామ్, జిల్లా ఇండస్ట్రియల్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి, ఈ.ఇందిరా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, కే. సంజీవరావు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, డి మధు ఆర్డిఓ కొత్తగూడెం, డి. దామోదర్ రావు ఆర్డీవో భద్రాచలం, ఈడి ఎస్సీ కార్పొరేషన్ ఆర్ ఉపేందర్, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, సిడిపివోలు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :