తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని కూలీలైన హైస్కూల్ వెనుక ఎంగిలి పూల బతుకమ్మ పండుగ తాజా మాజీ కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తదనంతరం బండారి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాల ప్రతీక అని బండారి తెలిపారు. ప్రతి పల్లెలో ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు పాటు గౌరమ్మను కొలిచే గొప్ప సంస్కృతి తెలంగాణది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సి లర్ రుక్మాంగాధర్ బండారి మరియుజీ. తిరుపతి, రామకృష్ణ, వాసు,రజనీకాంత్,రాజు తిరుపతి, కాళీ,మరియు రూప బండారి, సౌజన్య, మునిగ సుజాత,సృజన, రాజ్యలక్ష్మి, స్రవంతి, సంధ్య,రజిత, పద్మా, ఎం. సుజాత, మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగ వేడుకల్లో, బస్తీ పెద్దలు మరియు మహిళలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ