తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం పట్టణంలోని గోదావరి బ్రిడ్జి పాయింట్లో గల అంతరాష్ట్ర చెకోపోస్టు వద్ద టౌన్ పోలీసులు గురువారం రాత్రి గంజాయి పట్టుకున్నారు. చెకోపోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు స్కూటీపై అనుమానాస్పదంగా వస్తుండగా పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా, పరారయ్యారు. వెంబడించిన పోలీసులు ఒకరిని పట్టుకున్నారు. అతని వద్ద 4 కేజీల గంజాయి దొరికిందని, దాని విలువ రూ.2లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ