తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 30 తెలుగు వెలుగు ) : చండ్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం చంటి బిడ్డ నెత్తుకుని క్యూ లైన్ లో నిలబడ్డ మహిళ రైతు, ఉదయం 7 గంటలకే అధికారులు రాకముందే రైతులంతా క్యూ లైన్ గా చెప్పులు పెట్టి సొసైటీ కార్యాలయం ఎదుట ఎదురుచూస్తున్న సంఘటన స్టాక్ తక్కువగా ఉండటంతో ఒక్కొక్కరికి ఒక కట్ట మాత్రమే ఇస్తుండటం తో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులకు మాత్రమే సరఫరా కావడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గానుగపాడు సహకార సంఘం దగ్గర రైతులు నిరసన
Admin
తెలుగు వెలుగు టీవీ