తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 4 (తెలుగు వెలుగు) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బైకుల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ ఎం కరుణాకర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ వెల్లడిరచారు. ఈజీ మనికి అలవాటు పడిన భద్రాచలం పట్టణానికి చెందిన గుమ్మడి రాజు గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జల్సా జీవితాన్ని గడుపుతున్నాడు. మంగళవారం రాత్రి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా రాజు ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అతన్ని పోలీసులు ప్రశ్నించగా పొందలేని సమాధానం చెప్పడంతో అతని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇటీవల కాలంలో ఖమ్మంలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించాడు. రాజును పోలీసులు అరెస్టు చేసి ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ స్పష్టం చేశారు. దొంగను అదుపులోకి తీసుకోవడంలో కృషిచేసిన సిఐ కరుణాకర్, కానిస్టేబుల్ శంకర్ సురేష్ నరేష్‌లను డిఎస్పి అబ్దుల్ రహమాన్ ప్రత్యేకంగా అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ