తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 31 తెలుగు వెలుగు) పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. సిబ్బందికి పరేడ్ తీసుకొని, పోలీస్ స్టేషన్ లో ఈ సంవత్సరం నమోదు అయినటువంటి కేసుల గురించి, కేసు సంబంధిత రికార్డులను పరిశీలించి సంతృప్తి వెలిబుచ్చారు. సిబ్బంది పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.
సిబ్బంది పనితీరు, ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి ముద్దాయిలకు శిక్షపడేలా కోర్టు సిబ్బంది పనిచేయాలని తెలియజేసినారు. ప్రతి ఒక్క సిబ్బందితో మాట్లాడి వారి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సిఐ శ్రీ ఇంద్రసేనారెడ్డి మరియు ఎస్సై బాధావత్ రవి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ