తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు కొన్ని. సుజాతనగర్ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామం వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి కి సంబంధించి 0.7 కుంటల భూమి కోల్పోయిన చెట్టుపల్లి ప్రభాకర్ రావు అనే రైతు తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదని, కావున త్వరితగతిన నష్టపరిహారం ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం ఆర్డీవో కు ఎండార్స్ చేయడం జరిగింది. కొత్తగూడెం ఎన్కె నగర్ లో నివాసం ఉంటున్న సాకా ఠాగూర్ s/o పుష్పరాజు గత సంవత్సరం ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి కే ఎల్ ఆర్ కళాశాల నందు జాయిన్ అయ్యానని, కానీ అనారోగ్య కారణం చేత కళాశాలకు వెళ్లలేకపోయానని, తన ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం కళాశాలలను సంప్రదించగా మొత్తం ఫీజు చెల్లిస్తేనే తనకు సర్టిఫికెట్లు ఇస్తామని తెలియజేశారని, తన తల్లిదండ్రులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నామని కావున తనకు తన యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పించవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు.
పాల్వంచ మండలం యానం బైలు గ్రామంలో నివాసం ఉంటున్న ముగితే గురవయ్య s/o వెంకయ్య తనకు పూర్వీకుల నుండి వారసత్వంగా రాజాపురం గ్రామం శివారులో సర్వేనెంబర్ 107/72/1 లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని, ఆ వ్యవసాయ భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ భూమికి నలువైపులా ఉన్న వ్యక్తులు తన వారసత్వ భూమిని ఆక్రమించుకున్నారని కావున తమ భూమిని సర్వే చేసి తన ఐదు ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించేటట్లు చర్యలు చేపట్టాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పాల్వంచ తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు.
ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో నివాసం ఉంటున్న కుంజా తిరుపతమ్మ w/o నరసింహారావు (లేటు) తాను ఒక నిరుపేద గిరిజన మహిళనని, పేదరికం వలన బ్రతుకు దుర్భరంగా మారినందున బ్రతుకుతెరువు కొరకు ఏదైనా పథకం క్రింద రుణం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఐటిడిఏ పిఓ కు ఎండార్స్ చేశారు. అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కొంతమంది ప్రజలు తమ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కొరకు ఎంపిక చేసిన జాబితా నుండి అనర్హులను తొలగించి, తమ గ్రామమునందు గల నిరుపేదలకు, వితంతువులు మరియు వికలాంగుల పేర్లు జాబితాలో చేర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం హౌసింగ్ పిడి మరియు అశ్వరావుపేట ఎంపీడీవోకు ఎండార్స్ చేయడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ