Sunday, 21 June 2026 03:15:46 PM
# నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 21 June 2026 11:11 AM Views : 77

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ నందు యోగా తరగతులు యోగా ద్వారా పని ఒత్తిడి నుండి ఉపశమనం కలగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని,ఆనందమయమైన జీవితానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో అలవాటుగా చేసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ నందు యోగా తరగతులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటూ ఆనందమైన జీవితానికి యోగా ఉపయోగపడుతుందని,వేల సంవత్సరాల నుండి యోగా భారత దేశ సంస్కృతిలో బాగంగా ఉండడం మనకు దక్కిన గొప్ప గౌరవం అని,ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయని అన్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి విధి నిర్వహణలో ఒత్తిడి అనేది సర్వసాధారణం. శారీరక, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, యోగ కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఒక జీవన విధానం ప్రతి ఒక్కరూ యోగాను నిజ జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు.ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు,సిబ్బందితో యోగాసనాలు,ధ్యానం,శ్వాస పైన ధ్యాస,సూర్య నమస్కారాలు, ప్రాణాయామము తదితర ఆసనాలను వేసి వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోకొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ మరియు కొత్తగూడెం సబ్ డివిజన్ లోని పోలీస్ అధికారులు,ఆర్ఐలు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: