తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 3 తెలుగు వెలుగు ): జూలూరుపాడు మండలంలో రెండవ సాధారణ గ్రామపంచాయతీ మూడవ దశ ఎన్నికలు నోటిఫికేషన్ లో భాగంగా మండల వ్యాప్తంగా 24 పంచాయతీలకు గాను ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,గుండెపూడి 2, జూలూరుపాడు,3 పాపకొల్లు, 4పడమట నర్సాపురం,5కాకర్ల, 6 కొమ్ముగూడెం ఈ కేంద్రాల వద్ద ఈరోజు నుంచి నామినేషన్లు అధికారులు స్వీకరించటం జరుగుతున్నది. ఈ నామినేషన్ కేంద్రాలలో గుండెపుడి నామినేషన్ కేంద్రాన్ని మండల అభివృద్ధి అధికారి పూరేటి అజయ్ మరియు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి పరిశీలించారు. వీరితోపాటు ఎం పి ఓ తులసీరామ్, సూపర్డెంట్ రవి ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ