Monday, 20 April 2026 01:43:33 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

చర్ల మండలం పూసగుప్ప గ్రామంలో మొబైల్ హాస్పిటల్, అంబులెన్సు సేవలు ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 11 July 2025 05:47 PM Views : 616

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చర్ల మండలంలోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన పూసుగుప్పలో ఈ రోజు మొబైల్ హాస్పిటల్ మరియు అంబులెన్స్ సేవలను ప్రారంభించడం జరిగింది.భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తో పాటు, జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్,ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ లు పాల్గొన్నారు.స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ నిధుల ద్వారా విడుదలైన కోటి రూపాయల వ్యయంతో ఈ మొబైల్ హాస్పటల్ ను నిర్మించడం జరిగింది.చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి సారథ్యంలో పోలీస్ శాఖ విశేష సేవలను అందిస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సందర్భంగా అన్నారు.

పూసుగుప్ప గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే భద్రాచలం,కొత్తగూడెం పట్టణాలకి వెళ్లడానికి ఒకప్పుడు సరైన రహదారి కూడా లేదని,కానీ ఇప్పుడు ఇదే పూసుగుప్ప గ్రామానికి చర్ల నుండి అరగంట వ్యవధిలోనే చేరుకునే విధంగా రహదారిని మరియు ఇప్పుడు ఈ హాస్పిటల్ ని ప్రారంభించడంలో చర్ల పోలీసుల కృషి ఎంతగానో ఉందని అన్నారు.ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అందవలసిన సంక్షేమ పథకాలు కానీ,అభివృద్ధి కార్యక్రమాలు గానీ ఆదివాసీ ప్రజలకు అందజేయడంలో జిల్లా పోలీసుల కృషి అభినందనీయం అన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఏజెన్సీ ప్రాంతవాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఎలాంటి సమస్యలున్నా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించడంలో స్థానిక పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ఆదీవాసీ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు.సరిహద్దు చత్తీస్గడ్ రాష్ట్ర గ్రామాలైన రాంపురం,భీమారం గ్రామాల ప్రజలు కూడా ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు.అనంతరం అంబులెన్స్ వాహన సేవలను ప్రారంభించారు.ఇటీవల పూసుగుప్ప నుండి రాష్ట్ర సరిహద్దు వరకు నూతనంగా నిర్మితమైన బీటి రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్,చర్ల ఇన్స్పెక్టర్ రాజు వర్మ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ చెన్నూరి శ్రీనివాస్, E. శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :