తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సమక్షంలో, డాక్టర్ గడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంకు చెందిన పుదారి శ్యామ్ కుమార్ ( ప్రముఖ వ్యాపారస్తులు లక్ష్మీ స్పోర్ట్స్ అధినేత), అల్లూరి నాగరాజు జనసేన పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. అనంతరం రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ విస్తరణ, సంస్థాగత నిర్మాణం మరియు ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి నాయకులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మిరియాల రామకృష్ణ, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ