తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవి పల్లి మండలాల మధ్య ప్రవహిస్తున్న ముర్రేడు వాగు తీరం వెంట ఉన్న గ్రామాలను అతలాకుతలం చేస్తోంది. ఏ క్షణాన ఏ గ్రామం ముంపునకు గురవుతోందని బిక్కుబిక్కుమంటూ ప్రజలు జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం ముర్రేడు వాగు వరద ఉధృతికి రెండు వైపులా తీరాలు కోతకు గురవుతున్నాయి. ప్రతిసారి ఒక్కో తీరం వెంట పది నిర్మాణాలు నేలమట్టమవుతున్నాయి. తీరం కోతకు గురి కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ