తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆరోగ్య వారం కార్యక్రమాలలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో ఈ రోజు *డ్రగ్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్ డే ను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినట్లు జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన డ్రగ్ అవగాహన ర్యాలీలో డా. తుకారాం రాథోడ్ పాల్గొని ప్రజలకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల నియంత్రణలో భాగస్వాములు కావాలని, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాలు కలిసి చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాయి కళ్యాణ్, ప్రోగ్రాం ఆఫీసర్ (CHI) డా. ప్రతాప్ మరియు ఇతర వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ