Monday, 20 April 2026 01:31:34 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ఇల్లందులో విలేకరిపై దాడి అమానుషం, దాడిని ఖండించిన పాత్రికేయ సంఘాలు

Date : 19 October 2024 05:29 PM Views : 1272

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 19 (తెలుగు వెలుగు) ఇల్లందులో గురువారం రాత్రి విలేఖరి సుదర్శన్ పై దుండగులు మారనాయుధాలతో దాడి చేయడం అమానుషమని కొత్తగూడెం పాత్రికేయ సంఘాలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. సుదర్శన్ పై దాడిని నిరసిస్తూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పాత్రికేయ సంఘాలు పాత్రికేయులు శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సుదర్శన్ పై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్టు చేయడం అందుకు ఎస్పీ చొరవ తీసుకున్నందుకు పాత్రికేయులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ పాత్రికేయులతో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు మునుముందు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పాత్రికేయులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎవరైనా దాడి చేసే అవకాశాలు ఉన్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని పాత్రికేయులకు సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు ను కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో టి యు డబ్ల్యూ జె (టి జె ఎఫ్ ) 143 జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ,జిల్లా సహాయ కార్యదర్శి అచ్చి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, టి యు డబ్ల్యూ జె (ఐజేయు ) ఇమంది ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు ఎర్ర ఈశ్వర్, జాయింట్ సెక్రెటరీ సత్యానంద్ , టి యు జె ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోనిశెట్టి రమేష్, నాయకులు దాసరి వెంకటేశ్వర్లు (డివి ),చిన్న పత్రికల ప్రధాన కార్యదర్శి అబ్జల్ పఠాన్, సీనియర్ పాత్రికేయులు మోటమర్రి రామకృష్ణ, సీమకుర్తి రామకృష్ణ,ఆదాబ్ హైదరాబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టాప్ రిపోర్టర్ శ్రీనివాస్,మన తెలంగాణ జిల్లా స్టాఫర్ క్రాంతి కుమార్, వార్త సురేష్ ,ఆదాబ్ సింగరేణి ప్రతినిధి ఠాకూర్ సింగ్, డేవిడ్ జాన్సన్ బాబు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు వివిధ పాత్రికేయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :