తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అడవి బిడ్డల ఆచారాలు అపురూప జీవన విధానాలు సజీవ సంస్కృతికి భావితరాలకు విలువైన సమాచార వేదిక భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను అద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటకులను విశేషంగా ఆకర్షించినందుకు మరియు మ్యూజియంను ప్రాచర్యంలో తీసుకురావడానికి కృషి చేస్తున్నందుకు 2025 సంవత్సరానికి టూరిజం ఎక్స్లెన్స్ అవార్డును సీఎం చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.శనివారం నాడు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా శిల్పారామం లో జరిగిన ఈ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రీడా శాఖ మంత్రి వాకాటి శ్రీహరి పాల్గొని సజీవ సంస్కృతికి నిలయంగా రూపుదిద్దుకున్న ట్రైబల్ మ్యూజియం గిరిజనుల ఆనాటి ఆచార సంప్రదాయాలు జీవన విధానం, పండుగలు ఉపయోగించిన పనిముట్లు అన్ని సేకరించి తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లుగా మ్యూజియం రూపంలో పర్యాటకులు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు మరియు ఖండాంతరాలకు గిరిజన సంస్కృతిని తెలుసుకునే విధంగా అందుబాటులోకి తెచ్చినందుకు మరియు పాత తరం ఆదివాసి గిరిజనుల వంటకాలు పర్యాటకులు ఆస్వాదించేలా అందుబాటులో తెచ్చినందుకు పి ఓ మరియు ఏపీవో జనరల్ డేవిడ్ రాజును వారువారు ప్రత్యేకంగా అభినందించినట్లు ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన అధికారులు పర్యాటకశాఖ సిబ్బంది, సిని ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ