తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి(73) బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుండి నాలుగు సార్లు సూర్యాపేట నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటును మిగిల్చింది. మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంతాపం తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ