తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాలిటెక్నిక్ కళాశాల లో టూ టౌన్ పోలీసుల అవగాహన కార్యక్రమం . మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి రావాలని "ఇది ఒక వ్యక్తిని చంపడమే కాదు, సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. డ్రగ్కు నో చెప్పడంలో యువత అప్రమత్తంగా ఉండాలి మరియు బాధ్యతగా ఉండాలి" అని టూ టౌన్ సీఐ ప్రతాప్ అన్నారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డిఎస్పీ అబ్దుల్ రహమాన్ ఆదేశాల మేరకు టూ టౌన్ సీఐ ప్రతాప్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టూ టౌన్ సీఐ ప్రతాప్ మాట్లాడుతూ డ్రగ్స్ అలవాటుపడి యువత తమ మేధాశక్తిని వృథా చేసుకోకూడదన్నారు. డ్రగ్స్ ఒకసారి వాడినా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని యూత్ సోషల్ స్టేటస్, ఫ్యాషన్గా ఎంచుకుంటోందని, దీనిద్వారా విలువైన జీవితాలు నష్టపోతారని ఆయన అన్నారు. భవిష్యత్ లక్ష్యాలను ఎంచుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ తీసుకుని వాహనాలు నడిపితే రోడ్డు ప్ర మాదాలు సంభవిస్తాయన్నారు. సహనం కోల్పోయి ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాలాంటి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలుపాటిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. స్కూళ్లు, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటున్నా, విక్రయిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది మరియు టూ టౌన్ పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ