తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 11 బెంచీలు ఏర్పాటు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ కు అనూహ్య స్పందన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోర్టులో శనివారం రోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టులో 11 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. ఈ సారి జాతీయ లోక్ అదాలత్ కు అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. రాజీమార్గంలో కేసుల పరిష్కారంకోసం కక్షిదారులు పెద్ద ఎత్తున ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు యంత్రాంగం చేసిన కృషిని కొనియాడారు. వైవాహిక వివాదాన్ని సామరస్యంతో పరిష్కరించుకొని ఒక్కటైన దంపతులకు ఆవార్డు అందజేసి అభినందించారు. రాజీమార్గమే రాజమార్గం అని.. చిన్న తగాదాలను లోక్ అదాలత్ లో పరిష్కరించుకుని స్నేహ పూర్వక వాతావరణంలో ఉండాలని కక్షిదారులకు సూచించారు.రాజీ మార్గమే రాజమార్గమని కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఈ సందర్బంగ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతూ లోక్ అదాలత్ కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు. కక్షిదారులకు పులిహోర మంచినీటి సదుపాయమును ఎస్బిఐ వారి సౌజన్యంతో కల్పించారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్స్ కె. సాయి శ్రీ, బి.రవికుమార్, వినయ్ కుమార్, పి.పి పివిడి లక్ష్మి, గోపికృష్ణ, బాగం మాధవరావు, వి పురుషోత్తం రావు, నిరంజన్ రావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ