తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఈరోజు అనగా 05.03.2026, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అధ్యక్షతన "99" రోజుల ప్రణాళిక పక్షోత్సవ ప్రకారంగా చేపట్టవలసిన కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించడం జరిగినది. మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాలను వివరించడం జరిగినది. చేపట్టవలసిన కార్యక్రమాలు క్రింద తెలియజేయడం జరిగింది. 1. పారిశుధ్య కార్యక్రమాలు మరియు ఫైల్స్ క్లియరెన్స్ (06.03.2026 to 15.03.2026) 2. ఆదాయం పెంపుదల కార్యక్రమాలు (Tax Collection) (16.03.2026 to 31.03.2026) 3. త్రాగునీటి కార్యక్రమాలు (01.04.2026 to 15.04.2026) 4. గణ మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు (16.04.2026 to 30.04.2026) 5. ఉపాది హామీ కార్యక్రమాలు (01.05.2026 to 15.05.2026) 6. వర్షాకాల సన్నాహక పనులు (16.05.2026 to 31.05.2026) ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారిఎం విద్యా చందన మాట్లాడుతూ జిల్లాలో చేపట్టే కార్యక్రమాలను మరియు ప్రణాళికను మంత్రివర్యులకు వివరించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారిని, జిల్లా పంచాయతీ అధికారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిషన్ భగీరథ, ఆడిషనల్ డి ఆర్ డి వోలు మరియు సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ