తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (కార్పొరేషన్) కార్పొరేషన్ పరిధిలోని రామవరం లో నెలకొన్న ఎద్దడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోని తక్షణమే ఇంటింటికి మంచి నీళ్ళు అందించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించి పద్మ మాట్లాడుతూ కొత్త పైపుల ద్వారా నీటిని అందించడంలో కొంత జాప్యం జరుగుతుందని, కానీ ఎండాకాలం దృశ్య ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆన్నారు. అధికారులు ఇది గమనించాలని వారికి విజ్ఞప్తి చేశారు. జనాభాకు తగ్గట్టుగా కార్పొరేషన్ లో నీటి ట్యాంకర్లు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా మంచినీళ్ళను అందించలేకపోవడం బాధాకరమైనదని అన్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని వార్డుల్లో ఉన్న హ్యాండ్ పంపులు, మినీ వాటర్ బోర్లు ఉపయోగంలోకి తేవాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. 16వ డివిజన్లో అవసరం ఉన్న చోట టాంకర్ల ద్వారా మంచినీరు అందించడం జరిగిందని అన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా టాంకర్లు లేవని అన్నారు. 125 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులను త్వరితగతన పూర్తిచేసి ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలని లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.వీరి వెంట మాజీ మున్సిపల్ ప్లోర్ లీడర్ మునగడప వెంకటేశ్వర్లు, పంపు డ్రైవర్ జి శంకర్, రాకేష్ ,చారి ,సాయి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ