తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రాజ్యలక్ష్మి మోటార్స్ హీరో షోరూంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో కొత్త ద్విచక్ర వాహనాలు, విడి భాగాలు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చి, పక్క దుకాణాలకు వ్యాపించకుండా నివారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ