తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ తాజా పరీక్షా ఫలితాలలో స్టార్ చిల్డ్రన్ హై స్కూల్ స్టడీ సెంటర్ తన శిక్షణా నాణ్యత ను మరోసారి నిరూపించుకుంది. పరీక్షకు హాజరైన విద్యార్థులలో ఎక్కువమంది అత్యుత్తమ మార్కులు సాధించినట్లు ఏ ఐ కోఆర్డినేటర్ జి భాస్కర్ రావు ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలియజేసినారు. చదువుకు వయసుకు సంబంధం లేదని, చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ విద్యా విధానం అత్యుత్తమ వేదిక అని పేర్కొన్నారు. తమ సెంటర్ నుండి పరీక్ష వ్రాసి సబ్జెక్టుల వారిగా అత్యుత్తమ మార్కులు సాధించిన వారి వివరాలను తెలియజేస్తూ ఇంటర్ ఇంగ్లీష్ లో ఎర్రబోయిన నేహా శ్రీ 87, తెలుగులో కొమరం నాగమణి 88, పొలిటికల్ సైన్స్ లో కొర్ర హరిబాబు, కాల్వ అక్షయ్ 94 , అర్థశాస్త్రంలో పెర్సాని సాయి హర్షిణి, ఊడుగుల మహేంద్ర 85, కామర్స్ లో షేక్ హైమత్ 83, హిస్టరీ లో చల్లగొండ్ల నాగమణి 71 మార్కులు సాధించినట్లు, పదవ తరగతి ఇంగ్లీషులో షేక్ అమ్రిన్ నేహ 72, తెలుగులో పంపన కళ్యాణి 72, గృహ విజ్ఞాన శాస్త్రం లో బానోతు రమాదేవి 83, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ లో పల్లపు అశోక్ 80, సాంఘిక శాస్త్రంలో భానోత్ రమాదేవి 71 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. ఇంతటి ఘనవిజయానికి కారకులైన అభ్యాసకులను, అధ్యాపకులను అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ