తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చట్టబద్ధత లేకుండా బిల్లును తయారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా : బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం ఆగదు: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ అన్నీ తెలిసి కూడా హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా : బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ ఇంకా బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకోరు : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ కొత్తగూడెం బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో పాల్గొని బంద్ కు మద్దతు తెలిపిన : బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న బీసీలు అన్ని రంగాలలో వెనుకబడి పోతున్నారని బీఆర్ఎస్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా పోస్ట్ ఆఫీస్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలు 42 శాతం రిజర్వేషన్లను సాధించుకునే అంతవరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, రాజకీయ పార్టీలు బీసీలను ఓ పావుగా వాడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారంలోకి రావాలనే కుటిల బుద్ధితో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 50 శాతం మించకుండా రిజర్వేషన్లను కేటాయించాలని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ, తమ ఇష్టానుసారంగా బీసీలను మరో మారు మోసం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం, తీరా చట్టబద్ధత లేకుండా తీర్మానాలు చేసి హడావుడిగా రిజర్వేషన్లను ప్రకటిస్తే కోర్టు అడ్డుకోకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగ పరిధిలో ఉంటుందని, ఆ మేరకు నిర్ణయం తీసుకోవాల్సింది పోయి ఇష్టానుసారంగా చట్టాన్ని రూపొందించారని, రిజర్వేషన్లు చెల్లవనే విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తుందని ఆవేదన వ్యక్తిత్వం చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ అందరూ శాకాహారులే.. రొయ్యల మూట ఎలా మాయం : వనమా రాఘవ చట్ట సభల్లో తీర్మానంకు ఒకే చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందని, కానీ ఆ పార్టీల ప్రజా ప్రతినిధులు ఈ బందులో పాల్గొనడం చూస్తుంటే అందరూ శాకాహారులే రొయ్యల మూట ఎలా మాయమనే తీరులో ఉండటం కొంత విస్మయానికి గురిచేస్తుందన్నా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మాజీ కౌన్సిలర్లు అంబుల వేణు, వేముల ప్రసాద్, జేఏసీ చైర్మన్ కొదమూరు సత్యనారాయణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగబాబు, నవత, హుస్సేన్, బొమ్మిడి రమాకాంత్, బొమ్మిడి శ్రీకాంత్, సత్యనారాయణ (సంపూ), హైమద్, అచ్చ నరేందర్, కరాటే శీను, గటుమళ్ళ కనకరాజు, పూర్ణ ,తుంపిరి ప్రసాద్, వినోదు, వడ్డరి రాజు, మహేష్, పొగాకు వెంకటేశ్వర్లు, భార్గవ్, జగేదేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ