తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, కొత్తగూడెం, చుంచుపల్లి మండలం త్రీ ఇంక్లైన్ గ్రామపంచాయతీలో గల కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె)లో ప్రధానమంత్రి ధన్ ధన్య కృషి యోజన అనే కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమాంలో ప్రోగ్రాము కోఆర్డినేటర్ డా. టి. భరత్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలను సద్వినియోగం పడుచుకోవాలని ఆలాగే భూమిలో భూసారం పెంచుకోవాలని తెలపటం జరిగినది. ఈ కార్యక్రమాంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు మాట్లాడుతూ రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని తెలపటం జరిగినది. ఈ కార్యక్రమాంలో విస్తరణ శాస్త్రవేత్త డా. ఎన్. హేమ శరత్ చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త బి. శివ, డిడిఏ సరితా, మణుగూరు ఏడిఏ తాతారావు, ఎల్లందు ఏడిఏ లాల్ చాంద్, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు 250 మంది రైతులు పాల్గొనడం జరిగినది.
Admin
తెలుగు వెలుగు టీవీ