తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రులు సోమవారం ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి 108 ప్రసాదాలు మరియు స్వామివారి పారాయణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ధారా రమేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధారా రమేష్ కి ఉత్సా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం కన్వీనర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు చలువాది ప్రకాష్, ఉత్సవ కమిటీ మహిళా అధ్యక్షురాలు పెండ్యాల రోజా లక్ష్మి, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి గూడెపు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ధారా నరసింహారావు మరియు పాల్వంచ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ